![]() |
![]() |
.webp)
సెలెబ్రిటీలు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. కల్కి సినిమాలో దీపిక పదుకొనె నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆమెకు హిందీ తప్ప తెలుగు రాదు. ఇప్పుడు విషయం ఆమె గురించి కాదు దీపిక రంగరాజు గురించి మాట్లాడుకుందాం.
బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తున్న దీపిక రంగరాజు గురించి స్టార్ మా అభిమానులకి తెలిసిందే. స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో కనకం-కృష్ణమూర్తిల కుమార్తెగా కావ్య చేస్తోంది. దుగ్గిరాల ఇండి వారసుడు అపర్ణ సుభాష్ ల కొడుకు రాజ్ ని పెళ్ళి చేసుకున్న కావ్య.. ఎంతో అనుకువగా ఉంటూ అందరి మనసులు దోచేస్తోంది. అయితే కొత్త కోడలు అనామిక రావడంతో కావ్యది ఏం తప్పులేకపోయిన అప్పు ప్రేమ వల్ల తనని ధాన్యలక్ష్మి పూర్తిగా అపార్థం చేసుకుంది. దాంతో కథలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బాబు సుభాష్ కొడుకే అని తెలిసిపోవడంతో కథ మరో మలుపు తిరిగింది. దాంతో పాటు అసలు మాయ గురించి తెలుసుకోవడం తనని కావ్య ఇంటికి తీసుకురావడం మరింత ఇంట్రెస్ట్ గా మారింది.
.webp)
దీపిక రంగరాజు అయితే సీరియల్ లో సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా కన్పిస్తుంది. బయట మాత్రం నేను మాస్ ఊరమాస్ అంటుంది. రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడేమో ధాన్యలక్ష్మి అలియాస్ మాధురి దగ్గర తెలుగు నేర్చుకుంటండగా తీసిన ఓ వీడియోని షేర్ చేసింది దీపిక. తనకి షూటింగ్ టైమ్ లో కళ్యాణ్ అనే పేరు రాయడం రాకపోవడంతో ధాన్యలక్ష్మి దగ్గరనుండి ఓ పేపర్ మీద రాసిచ్చిందంట. దానిని చూస్తూ కావ్య అలియాస్ దీపిక రాస్తుందంట. మొన్నటి నుండి తెలుగు నేర్చుకోవాలని అనుకుంటుందం దీపిక. ఇక ఈ లోపే మాధురి అక్క తనకి ఇలా నేర్పిస్తుందని చెప్పింది. ఇక ఈ వీడియోని అనామిక షూట్ చేసిందంట. ఇలా షూటింగ్ మధ్యలో ఖాళీ దొరికితే దీపిక, మాధురి వాళ్ళంతా కలిసి రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. ఆ వీడియోని మీరు ఓసారి చూసేయ్యండి.
![]() |
![]() |